కడప జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు సంబంధించి 2023-24, 2024-25 వార్షిక జమలను వెంటనే ఆన్ లైన్ చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సి. ఓబులమ్మకు శుక్రవారం యుటిఎఫ్ జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ జీతభత్యాల నుండి కొంత సొమ్మును ప్రతినెల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు పొదుపు కింద జమ చేస్తున్నారని, అయితే ఆన్ లైన్ చేయలేదన్నారు.