రాయలసీమ బలిజలు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని బుధవారం కడప ప్రెస్ క్లబ్ లో రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు సమతం రాము అన్నారు. గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ బలిజలకు తీవ్ర నిరాశ కు గురి చేసాయన్నారు. దివంగత వైఎస్సార్ బలిజలను బీసీలను చేయడంలో అలసత్వం వహించారని, ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా బలిజలను మోసం చేశారన్నారు.