రాయమసీమ భాష, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు తదితరలపై నిర్వహించిన కవితా పోటీల్లో విద్యార్థినులు సీమ ఔన్నత్యాన్ని ఘనంగా చాటి చెప్పారని జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు మూల మల్లికార్జునరెడ్డి పేర్కొ న్నారు. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరగనున్న జిల్లా రచయితల మహా సభల్లో ఏర్పాటు చేయనున్న శతాధిక కవి సమ్మేళనంలో భాగంగా శుక్రవారం కడప కోటిరెడ్డి మహిళా ప్రభుత్వ కళాశాల విద్యార్థినులకు కవితా పోటీలు నిర్వహించారు.