తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్దంతి కార్యక్రమాన్ని రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేది ఉదయం 10 గంటలకు కడప ప్రెస్‌క్లబ్‌లో నిర్వహిస్తున్నామని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఎన్. రవిశంకర్‌రెడ్డి, జానమద్ది విజయభాస్కర్, మన్నూరు అక్బర్ తెలిపారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మాధవి, కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొంటారన్నారు.