కడప అర్బన్ తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని కార్పొరేషన్ కమిషనర్ మనోజ్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన మున్సిపల్ యూనియన్ నాయకులతో తమ కార్యాలయ సమావేశ మందిరలో చర్చించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కమిషనర్ దృష్టికి పలు సమస్యలు తెలియజేశారు. ప్రధానంగా 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా తొలగించడం అన్యాయమని, అడిషనల్ కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం, రెగ్యులర్ కార్మికులకు ప్రత్యేక క్వార్టర్స్ ఇవ్వాలని కోరారు.