వైసిపి ప్రజలలో తమ ఉనికి కాపాడుకోవడం కోసమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బురద చల్లుతూ ఉందని కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కడప నగరంలోని ఆయన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడచిన 7 నెలలలో రాష్ట్రం అభివృద్ధి పందాలో ఉందని, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. వైసిపి తమ నాయకులను కాపాడుకోవడం కోసం జమిలి ఎన్నికలను తెరమీదకి తీసుకొచ్చారన్నారు.