యోగి వేమన విశ్వవిద్యాలయం, కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ఏజీ దామును ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశ్వవిద్యాలయంలోని వీసీ చాంబర్ లో ఆచార్య ఎ. జి. దాముకు ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి నియామకపు పత్రాన్ని అందజేశారు. ఇదివరకు డీన్ గా పనిచేసిన ఆచార్య కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తికావడంతో నూతన నియామకం చేపట్టారు.