కడప నగరం 19వ డివిజన్ లో బుధవారం నిర్వహించిన మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. కడప నగరంలో ప్రతి డివిజన్ పరిశుభ్రంగా ఉండాలని, మురుగు కాలువల్లో చెత్త పేరుకు పోయి రోగాలు ప్రబలకుండా ఉండాలన్న సంకల్పంతో మున్సిపల్ అధికారులను వెంటపెట్టుకొని మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.