షెడ్యూలు కులాల వర్గీకరణపై ప్రజా అభిప్రాయ సేకరణకు కడపకు శుక్రవారం వచ్చిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, జిల్లా కలెక్టర్ తో కలిసి ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఇన్ చార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జేసీ అదితిసింగ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, అధికారులు పాల్గొన్నారు.