ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహలు జైలు కన్నా అద్వాన రీతిలో ఉన్నాయని ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్ధన్ డిమాండ్ చేశారు. గురువారం కడప కలెక్టరేట్ ఎదుట వసతి గృహ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా రెవిన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు.