కడప పట్టణంలో ధావన్ సెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లింగాల మండలంలో లోపట్‌నూతల గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య పురస్కారం అందుకున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 21 మంది రచయితలు ఈ అవార్డును శుక్రవారం అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న ప్రవీణ్ కి తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.