ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడప నుంచి తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. కడపలోని తన కార్యాలయంలో శనివారం నగరంలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏపీజీబీ కార్యాలయాన్ని తరలిస్తే జిల్లాకు జరిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐఎంఏ భవనంలో ఈనెల 12న సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.