వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మండల వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఎంపీపీ లక్ష్మీప్రసన్న, ఎంపీడీఓ కుల్లాయి బాబు, వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి అధికారులను కోరారు. ఆదివారం చింతకొమ్మదిన్నే ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.