ప్రజలు డెంగ్యూకు దూరంగా ఉండాలని చెన్నూరు వైద్యాధికారులు సూచించారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గ్రామంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ గృహాలలో నీటి నిలువలో దోమల గుడ్లు అభివృద్ధి చెందకుండా చూసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో తాగి పడేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పనికిరాని డబ్బాలు ఉంచవద్దన్నారు.