ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెన్నూరు ఎంఈఓలు గంగిరెడ్డి, సునీత అన్నారు. గురువారం చెన్నూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో యాజమాన్య కమిటీ సభ్యులకు, పాఠశాల హెచ్ఎంలకు ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాల యాజమాన్య కమిటీ తమ వంతు బాధ్యతతో ముందుకు రావాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని వారికి వివరించారు.