కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ కడప జిల్లాలో తన మూడు రోజుల పర్యటన ముగించుకొని శుక్రవారం కడప ఆర్ & బి గెస్ట్ హౌస్ నుండి రోడ్డు మార్గాన తిరుపతి రేణిగుంట విమానాశ్రయంకు బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఘన వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యేలు మాధవి రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కృష్ణ చైతన్య రెడ్డి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి పలువురు నేతలు వీడ్కోలు పలికారు.