కడప జిల్లాలో వివిధ అనారోగ్య కారణాలతో పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల్లో పలువురు అనర్హులున్నారనే ఆరోపణల నేపథ్యంలో వాటి పరిశీలనకు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ శనివారం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఇద్దరు వైద్యులతో పాటు సచివాలయ యంత్రాంగం ఉంటారు. ఈ నెల 6 నుంచి 27వ తేదీ వరకు ఆయా బృందాలు జిల్లా వ్యాప్తంగా 931 మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాస్తవాలను నిర్ధారిస్తారు.