కమలాపురం: త్రాగునీటి పైపులు లీకేజీ

56చూసినవారు
కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని కే. అపాయపల్లి మెయిన్ రోడ్డులో పైపులైను లీకేజీ అయ్యి నీరు వృథాగా పోతోంది. అంతేకాకుండా ఆ నీరు నిల్వ ఉండడంతో మురుగు తయారై పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గత వారం రోజులుగా సమస్య ఉన్నా కూడా అధికారులు స్పందించడం లేదని స్థానికులంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్