పెండ్లిమర్రి జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్ కు విద్యార్థులు తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన మందస్తు సంక్రాంతి సంబరాలో పాల్గొన్నారు.