కర్నూలు మండలం ఈ.తాండ్రపాడులో మంచినీటి సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ ఎస్. బాలపీర, వెంకటేశ్వర్లు కర్నూలు ఎంపీ నాగరాజుకు వినతిపత్రం ఇచ్చారు. ఆదివారం కర్నూలులోని ఎంపీ నివాసంలో కలిసి మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ. 70 లక్షలు మంజూరైన, కాంట్రాక్టర్ సమస్య వల్ల డబ్బులు వెనక్కి వెళ్లాయన్నారు. గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని, మరో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.