కుటుంబ కలహాలతో శుక్రవారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. బి. కొత్తకోటకు చెందిన లికిత (20) భర్తతో గొడవపడి మనస్థాపానికి గురై ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాధితురాలని వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటుంది.