భారతదేశ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి సరస వెంకటనారాయణ బట్ మదనపల్లెకు వచ్చారు. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయమూర్తితో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ రావడంతో డీఎస్పీ కొండయ్య నాయుడు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మదనపల్లె కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని మరికొంత సేపట్లో ప్రారంభించ నుండడంతో కోర్టు వద్ద శనివారం అధికారులు స్వాగత ఏర్పాట్లు చేశారు.