డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. ఆదివారం మదనపల్లె కోటబడి పాఠశాలలో యాంటీ డ్రగ్స్ డే నిర్వహించారు. యూత్ కరాటే మాస్టర్ సురేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కరాటే విద్యార్థులతో కలసి డ్రగ్స్, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేశారు.