బసినికొండలో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడినట్లు మదనపల్లి తాలూకా ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. బికే పల్లి కాలనీలో ఉంటున్న ఫిరోజ్(23) బైక్ పై పుంగనూరు రోడ్డు వైపు వెళ్ళాడు. ఇంటికి తిరిగి వస్తుండగా మునిసిపల్ బోర్డు డౌన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.