అన్నమయ్య జిల్లా మదనపల్లె దగ్గర ఉన్న ఆటోనగర్ లో 33 ఎకరాల్లో సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్బంగా వలసపల్లి వద్ద ఆటోనగర్ ను సందర్శించి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ. చేతి వృత్తులు, మిగతా పనులు ఆటోనగర్ లో చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆటో నగర్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తామన్నారు. పేద, మధ్యతరగతి వారికి అంకితం చేస్తామని తెలిపారు.