బాలిక అదృశ్యంపై కేసు నమోదుచేసినట్టు రామసముద్రం ఎస్సై రవికుమార్ తెలిపారు. ఎస్సై వివరాల మేరకు నరసాపురం గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక ఈనెల 14వ తేదీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమె కోసం బంధువులు, స్నేహితులను విచారించగా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం బాలిక తల్లి స్వాతి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.