మదనపల్లి రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ శనివారం రామసముద్రం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లో పోలీసు వ్యవస్థ పనితీరు, చర్యలను సమీక్షించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులతో మర్యాదగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.