సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా శుక్రవారం మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో బహుజన యువసేన బి.వై.ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులకు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ.. శూద్రుల అస్పృశ్యల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా విశ్వసించి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.