మదనపల్లె తాలూకా 1 ఎస్ఐగా గాయత్రి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లె 2టౌన్ 2ఎస్ఐగా పనిచేస్తున్న గాయత్రిను తాలూకా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. గతంలో తాలూకా ఎస్ఐగా పని చేస్తున్న హరిహరప్రసాద్ పీటీఎంకు బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మదనపల్లె 2టౌన్ 2ఎస్ఐగా ఉన్న గాయత్రి తాలూకాకు, తాలూక ఎస్ఐ పీటీఎంకు, పీటీఎం ఎస్ఐ రామసముద్రంకు బదిలీపై వెళ్లి విధుల్లో చేరారు.