బుల్డోజర్ జస్టిస్‌పై కీలక తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు
బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుల ఇళ్లను కూల్చడం నివసించే హక్కును కాలరాయడమని, నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తెలిపింది. దోషిగా నిర్దారణ అయినా చట్ట ప్రకారం చర్యలుంటాయని, ఇళ్లను కూల్చే విధానం సరికాదని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. తక్షణమే ఈ బుల్డోజర్ విధానాన్ని ఆపాలని, లేనిచో సదరు అధికారులు, సంబంధం ఉన్న వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.