మదనపల్లి కోర్టు ఆవరణలో శనివారం నూతన కోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరస వెంకటనారాయణ బట్ ప్రారంభించారు. సభలో మాట్లాడుతూ తాను మదనపల్లిలో పుట్టి పెరిగినందుకు గర్వంగా ఉందన్నారు. తన గురువులు, సహచరుల సహకారంతో ఈ స్థాయికి ఎదిగినట్టు తెలిపారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎలా ఉండాలో ప్రాముఖ్యతను వివరించారు.