రామసముద్రం: గాయపడిన యువకుడు మృతి

55చూసినవారు
రామసముద్రం: గాయపడిన యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామసముద్రం కర్నాల వీధికి చెందిన వేణు (25) శనివారం వేలూరు ఆసుపత్రిలో మృతి చెందాడు. వారం క్రితం తమిళనాడులో బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వేణును ఆసుపత్రిలో చేర్చగా, వారం రోజుల పాటు చికిత్స పొందాడు. చివరికి మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్