రామసముద్రం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి రథోత్సవంలో భాగంగా శుక్రవారం స్వామి వారు శ్రీ పాండురంగ స్వామి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు పార్థసారథి బట్టర్, కులశేఖర్ బట్టర్, భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.