పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ శ్రావణ రెండవ శుక్రవారం ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించింది. అమ్మవారికి ఆలయంలో మంత్రపుష్పం, కుంకుమార్చన, అభిషేక, పుష్పాలంకరణ, దూపదీప నైవేద్యం అర్చకులు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి, మొక్కలు చెల్లించుకున్నారు.