విషం తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం

85చూసినవారు
విషం తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం
విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములకలచెరువులో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా, తనకల్లు మండలం, తవలానికి చెందిన శ్రీకాంత్(25) ములకలచెరువుకు భవన నిర్మాణం పనులు చేయడానికి కుటుంబీకులతో వచ్చాడు. మద్యం కొనుగోలుకు కుటుంబీకులు డబ్బు ఇవ్వలేదని మనస్థాపం చెందిన యువకుడు విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రభుత్వాసుపత్రికి తరలించి,ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నట్లు ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్