మదనపల్లెలో కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కి వ్యతిరేకంగా నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమం మదనపల్లె వ్యవసాయ కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు బుధవారం నిరసన తెలిపి ధర్నా చేశారు. స్థానిక మల్లికార్జున సర్కిల్ సమీపంలోని హెడ్ పోస్టాఫీసు కార్యాలయం సమీపంలో సీపీఐ నాయకులు కృష్ణప్ప, ఏఐటీయూసీ నాయకులు సాంబశివ, మురళి ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది.