ఫిబ్రవరి 7న ఛలో హైదరాబాద్ లో 'లక్ష డబ్బులు 1000 గొంతుకల' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.