ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో రైతుల, ప్రజల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శనివారం చాపాడు మండలం బద్రిపల్లె గ్రామంలో గ్రామ సర్పంచ్ గుత్తి మల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల భూ సమస్యలు పరిష్కారం కోసం రెవెన్యూ సర్వీసులు సద్వినియోగపడతాయన్నారు.