రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నూతన ఇసుక పాలసీ, ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత, పట్టా లాండ్స్, సెమీ మెకానిస్ట్ ఇసుక రీచ్లు వంటి అంశాలపై అమరావతి నుండి గనులు భూగర్భ శాఖ కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.