మైదుకూరు: కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటుకు డిమాండు

78చూసినవారు
మైదుకూరు: కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటుకు డిమాండు
కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఎ. వి. రమణ డిమాండు చేశారు. ఈమేరకు సోమవారం మైదుకూరు తహసీల్దారు కార్యాలయం వద్ద రైతు సేవా సమితి ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడి సాయం రూ. 20 వేలు అందించి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయాలన్నారు. తెలుగుగంగ, రాజోలి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్