మైదుకూరులోని శ్రీ నగరం గ్రామంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 22న హనుమత్ జయంతి వేడుకలు నిర్వహిస్తారని శుక్రవారం ఆలయ కమిటీ పేర్కొన్నారు. ఉదయం స్వామివార్లకు, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత విగ్రహాలకు ప్రత్యేక అభిషేకంనిర్వహిస్తారు. గణపతి పూజ, స్వస్తి వాచనం, విశ్వశాంతి యాగం, నవగ్రహ హోమం వంటి పలు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు వెంకటరమణయ్య కోరారు.