మైదుకూరు మండలం ఉప్పుగుంటపల్లెలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందా కృష్ణ మాదిగకు మంగళవారం శుభాకాంక్షలు తెలుపుతూ డప్పులు వాయించి కేకు కట్టింగ్ చేశారు. మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ మందా కృష్ణ మాదిగ కు పద్మశ్రీ అవార్డు దక్కడం మనందరికి గర్వకారణం అన్నారు. సీనియర్ నాయకుడు ఎడిసి లక్షుమయ్య ఫిబ్రవరి 7న వేల గొంతులు లక్షల డప్పులు కార్యక్రమానికి ప్రతి కుటుంబం నుంచి పాల్గొనాలని పిలుపునిచ్చారు.