మైదుకూరు: ఉర్దూ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

63చూసినవారు
మైదుకూరు: ఉర్దూ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం
మైదుకూరు బాలికల ఉర్దూ జూనియర్ కళాశాలలో శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడంతో గ్రామీణ విద్యార్థులకు తోడ్పాటు అందించడం జరిగిందన్నారు. చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.

సంబంధిత పోస్ట్