పునీత వేళంగాని మాత 23వ తిరుణాల వార్షికోత్సవం

73చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలం పలుగురాళ్లపల్లె గ్రామంలో ఆదివారం వేళంగానిమాత 23వ తిరుణాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ దేవరాజ్ ఆధ్వర్యంలో దివ్యబలి పూజకార్యక్రమం నిర్వహించారు. గ్రామ పురవీధుల గుండా వెలంగాని మాత ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మార్తమ్మ జయన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.