సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుతో మాదిగ డప్పు నాట్యమాడింది. శుక్రవారం మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి మాదిగ కాలనీలలో ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాల్లో మునిగితెలిపోయారు. మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ విజయం సాధించడం పట్ల స్ర్తి, పురుష వయో భేదం లేకుండా సంబరాల్లో పాల్గొన్నారు. బిజేపి ఎస్. సి రిజర్వేషన్ వర్గీకరణకు కట్టుబడి ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేవు. సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.