సార్వత్రిక ఎన్నికల తర్వాత జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరూ ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదని, అలా ఎవరైనా గొడవలకు ప్రయత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని పీలేరు సిఐ మోహన్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం సీఐ స్థానిక పోలీసులతో పాటు సి. ఆర్. పి. ఎఫ్ బలగాలతో పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పీలేరులో వారపు సంత రద్దు చేశామని తెలియజేశారు.