ప్రొద్దుటూరు స్థానిక శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో శుక్రవారం శ్రీశక్తి పీఠం పీఠాదీశ్వరి మాతా రమ్యానందభారతి స్వామినీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 102 మంది ఆర్యవైశ్య సుహాసినులతో సుహాసిని పూజ నిర్వహించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. సాయంత్రం రమ్యానందభారతి స్వామినీ వారాహి దేవి మహత్యం పై ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.