ప్రొద్దుటూరు స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలోని పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రథమ శ్రేణి గ్రంథాలయానికి గురువారం మానవతా సేవా ట్రస్టు వారు డీఎస్సీ పోటీ పరీక్షల పుస్తకాలను వితరణగా అందించారు. ఈ సందర్భంగా మానవతా సేవా ట్రస్టు డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ తోపాటు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.