ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కడప జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వై. హరి కోరారు. గురువారం ప్రొద్దుటూరులో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. జనవరి 21, 22 తేదీలలో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో కార్మికుల సమస్యలపై నాయకులు చర్చించి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తారన్నారు.