మద్యం పాలసీ ద్వారా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాచమల్లు ప్రసాద్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ గతలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేసింది కాబట్టి ఎక్కడ మోసం లేదని, ఇప్పుడు ప్రయివేట్ వ్యక్తులు మద్యం అమ్మకాలు కొనసాగిస్తుండడంతో మోసం జరుగుతుందన్నారు. ప్రొద్దుటూరులో 40 బ్రాందీ షాపులు ఉన్నాయన్నారు.